Home  »  Bollywood News  »  జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రముఖ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్

Updated : Aug 17, 2026


సినిమాల్లో ఏదైనా కీలక సన్నివేశం జరుగుతున్నపుడు హీరో, హీరోయిన్స్ తో పాటు కొన్ని కీలకమైన క్యారెక్టర్స్ సడన్ గా జ్ఞాపకశక్తిని కోల్పోవడం జరుగుతుంది. దీంతో అక్కడ జరుగుతుంది నటన అని తెలిసినా  క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయిన  ప్రేక్షకులు ఒక రేంజ్ లో గగ్గోలు పెడుతుంటారు. కానీ ఇప్పుడు రియల్ గా, లైవ్ లో ఒక నటి  జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో అభిమానుల కండిషన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు


బుల్లితెరపై అత్యంత సాహసోపేతమైన రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' సీజన్ 15 లో అందరినీ ఉలిక్కిపడేలా చేసే ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ తో పాటు సౌత్ చిత్రసీమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుని, తెలుగులో అల్లరి నరేష్ సరసన '3G లవ్', అలాగే 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' చిత్రాలలో నటించిన ప్రముఖ నటి జాస్మిన్ భాసిన్ ఈ షోలో ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యారు. షోలో భాగమైన కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా ఆమె తాత్కాలికంగా తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వారాంతంలో జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా నీరు, గాలితో కూడిన ఒక అత్యంత ప్రమాదకరమైన వాటర్ అండ్ ఎయిర్ స్టంట్‌ను జాస్మిన్ భాసిన్ నిర్వహించాల్సి వచ్చింది. స్టంట్ చేస్తుండగా ఊహించని విధంగా ఆమె బ్యాలెన్స్ తప్పి వేగంగా నీటిలో పడిపోయారు. నీటి తీవ్రతకు ఆమె తలకు స్వల్ప గాయం (Mild Concussion) కావడం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్టంట్ పూర్తయిన వెంటనే నీటి నుంచి బయటకు వచ్చిన జాస్మిన్ తీవ్ర అయోమయానికి గురైంది. అక్కడ ఏం జరుగుతోంది, అసలు తను ఎందుకు అక్కడ ఉందో కూడా చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోవడంతో సెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

షో హోస్ట్, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిని కలిసిన జాస్మిన్.. పదేపదే తనకు ఏం జరిగిందో గుర్తులేదని, తన మైండ్ ఖాళీగా అనిపిస్తోందని చెబుతుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాస్మిన్ ముఖంలో కనిపించిన భయం, అయోమయాన్ని చూసి రోహిత్ శెట్టి ఆమెను సముదాయిస్తూ, ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన షో వైద్య బృందం ఆమెను అత్యవసరంగా పరీక్షించి, హెడ్ ఇంజ్యూరీ వల్ల తాత్కాలిక జ్ఞాపకశక్తి లోపం (Temporary Memory Loss) ఏర్పడిందని నిర్ధారించారు. అనంతరం ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, కనీసం 72 గంటల పాటు (3 రోజుల పాటు) పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ చేదు అనుభవంపై తర్వాత స్పందించిన జాస్మిన్ భాసిన్ తన ఆందోళనను పంచుకున్నారు. "ఆ స్టంట్ నా జీవితంలో అత్యంత విచిత్రమైన, భయంకరమైన అనుభవం. స్టంట్ ముగిసిన వెంటనే ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అస్సలు గుర్తులేదు. నా మెదడులో ఆ క్షణాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వైద్యులు, రోహిత్ సర్, షో మేనేజ్‌మెంట్ నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు" అని వెల్లడించారు. ఇది మానసికంగా ఎంతో సవాలుగా అనిపించినప్పటికీ, తనలోని ఫైటర్ స్పిరిట్‌ను మళ్ళీ నిద్రలేపిందని ఆమె పేర్కొన్నారు.

Also Read: నటనకే నటన నేర్పాడా! విశ్వనాధ్ అండ్ సన్స్  కలెక్షన్స్ మూడు రోజుల కలెక్షన్స్ ఇవే  

అయితే 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' షో వరుసగా మూడో వారం కూడా వివాదాల్లో నిలవడం గమనార్హం. మొదటి వారంలో పెల్లెట్ గన్ టాస్క్, రెండో వారంలో పోటీదారుల చేతులపై వేడి మైనం పోసే స్టంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు ఏకంగా నటి జ్ఞాపకశక్తి కోల్పోయేలా ప్రమాదం జరగడంతో షోలో కంటెస్టెంట్ల భద్రతా ఏర్పాట్లపై ప్రేక్షకులు మరియు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Jasmin Bhasin, Khatron Ke Khiladi 15, Bollywood


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.